View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన రాముడు లోకాభిరాముడు


రాగం: రామక్రియా
ఆ: స గ3 మ1 ప ద1 ని3 స
అవ: స ని3 ప ద1 ప మ1 గ3 రి1 స

రాగం: ముఖారి
ఆ: స రి2 మ1 ప ని2 ద2 స
అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
రాముడు లోకాభి రాముడు ।
వేమారు మొక్కుచు సేవిన్చరో జనులు ॥ (2.4)

చరణం 1
చెలువుపు రూపమును జితకాముడు
మలసి బిరుతిన సమర భీముడు ॥ (2)
పొలుపైన సాకేతపుర ధాముడు (2)
ఇలలో ప్రజలకెల్ల హిత ధాముడు ॥ (2)
రాముడు లోకాభిరాముడు ..(ప..)

చరణం 2
ఘన కాన్తుల నీల మేఘ శ్యాముడు
అనిశము సుతుల సహస్ర నాముడు ॥ (2)
కనుపట్టు కపి నాయక స్తోముడు (2)
తనునెన్చితే దేవతా సార్వభౌముడు ॥ (2)
రాముడు లోకాభిరాముడు..(ప..)

చరణం 3
సిరుల మిన్చిన తులసీ ధాముడు
కరుణానిధియైన భక్త ప్రేముడు ॥ (2)
ఉరుతర మహిమల నుద్ధాముడు (2)
అరిమెమె శ్ఱి వేన్కటగిరి గ్రాముడు ॥ (2)

రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరఙ్గ భీముడు వాడే ॥ (2.5)




Browse Related Categories: