View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన మేలుకో శ్రుఙ్గారరాయ


రాగం: భూపాళ
ఆ: స రి1 గ2 ప ద1 స
అవ: స ద1 ప గ2 రి1 స
తాళం: ఆది

పల్లవి
మేలుకో శృఙ్గారరాయ మేటి మదనగోపాల ।
మేలుకోవె నాపాల ముఞ్చిన నిధానమా ॥ (2)

చరణం 1
సన్దడిచే గోపికల జవ్వనవనములోన ।
కన్దువన్దిరిగే మదగజమవు । (2)
యిన్దుముఖి సత్యభామ హృదయ పద్మములోని ।
గన్ధము మరిగినట్టి గణ్డు తుమ్మెద ॥ (2)
మేలుకో శృఙ్గారరాయ మేటి మదనగోపాల..(ప..)

చరణం 2
గతిగూడి రుక్మిణికౌగిట పఞ్జరములో ।
రతిముద్దు గురిసేటి రాచిలుకా । (2)
సతుల పదారువేల జణ్ట కన్నుల గలువల- ।
కితమై పొడిమిన నా యిన్దు బిమ్బమ ॥ (2)
మేలుకో శృఙ్గారరాయ మేటి మదనగోపాల..(ప..)

చరణం 3
వరుసం గొలనిలోని వారి చన్నుఙ్గొణ్డలపై ।
నిరతి వాలిన నా నీలమేఘమా । (2)
శిరనురమున మోచి శ్రీ వేఙ్కటాద్రి మీద ।
గరిమ వరాలిచ్చే కల్పతరువా ॥ (2)
మేలుకో శృఙ్గారరాయ మేటి మదనగోపాల ।
మేలుకోవె నాపాల ముఞ్చిన నిధానమా ॥




Browse Related Categories: