View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన నవరసములదీ నళినాక్షి


రాగం: దేసి
ఆ: స రి2 మ1 ప ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
నవరసములదీ నళినాక్షి ।
జవకట్టి నీకు జవి సేసీని ॥ (2.5)

చరణం 1
శృఙ్గార రసము చెలియ మొకమ్బున ।
సఙ్గతి వీరరసము గోళ్ళ । (2)
రఙ్గగు కరుణరసము పెదవులను । (2)
అఙ్గపు గుచముల నద్భుత రసము ॥
నవరసములదీ నళినాక్షి.. (ప..)(1.5)

చరణం 2
చెలి హాస్యరసము చెలవుల నిణ్డీ ।
పలుచని నడుమున భయరసము । (2)
కలికి వాడుగన్నుల భీభత్సము । (2)
అల బొమ జఙ్కెనల నదె రౌద్రమ్బు ॥
నవరసములదీ నళినాక్షి.. (ప..)(1.5)

చరణం 3
రతి మరపుల శాన్తరసమ్బదె ।
అతి మోహము పదియవరసము । (2)
ఇత్వుగ శ్రీవేఙ్కటేశ కూడితివి । (2)
సతమై యీపెకు సన్తోస రసము ॥
నవరసములదీ నళినాక్షి ।
జవకట్టి నీకు జవి సేసీని ॥ (2.5)




Browse Related Categories: