View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి


రాగం: లలితా
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
తాళం:

పల్లవి
షోడశ కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (2.5)

చరణం 1
అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె
సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే ।
అలగఙ్గా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ॥
షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.)
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5)

చరణం 2
వరపీతామ్బరునకు వస్త్రాలఙ్కారమిదె
సరి శ్రీమన్తునకు భూషణములివే । (2.5)
ధరణీధరునకు గన్ధపుష్ప ధూపములు
తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ॥ (2.5)
షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.)
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5)

చరణం 3
అమృతమథనునకు నదివో నైవేద్యము
రవిజన్ద్రనేత్రునకు కప్పురవిడెము ।
అమరిన శ్రీవేఙ్కటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దణ్డములు నివిగో ॥
షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.)
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5)




Browse Related Categories: