అన్నమయ్య కీర్తన పుట్టు భోగులము మేము
రాగం: మధ్యామావతి/ పాడి ఆ: స రి1 మ1 ప ని3 స అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స పల్లవి పుట్టుభోగులము మేము భువి హరిదాసులము । నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ॥ (2) చరణం 1 పల్లకీలు నన్దనాలు పడివాగె తేజీలు వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు । (2) తల్లియాకె మగనినే దైవమని కొలిచేము (2) వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ॥ పుట్టుభోగులము మేము భువి హరిదాసులము..(ప..) (2) చరణం 2 గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు ఆమని భూకాన్తకు నఙ్గభేదాలు ॥ (2) భామిని యాకె మగని ప్రాణధారి లెఙ్క- (2) లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ॥ పుట్టుభోగులము మేము భువి హరిదాసులము..(ప..) (2) చరణం 3 పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు వెస బ్రహ్మతణ్డ్రి శ్రీ వేఙ్కటేశుడు । (2) యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె (2) వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ॥ పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ॥ (2)
Browse Related Categories: