View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన అన్ని మన్త్రములు


రాగం: అమృతవర్షిణి
ఆ: స గ3 మ2 ప ని3 స
అవ: స ని3 ప మ2 గ3 స
తాళం: ఆది

పల్లవి
అన్ని మన్త్రములు నిన్దే ఆవహిఞ్చెను
వెన్నతో నాకు గలిగె వేఙ్కటేశు మన్త్రము ॥ (2.5)

చరణం 1
నారదుణ్డు జపియిఞ్చె నారాయణ మన్త్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మన్త్రము । (2)
కోరి విభీషణుణ్డు చేకొనె రామ మన్త్రము
వేరె నాకు గలిగె వేఙ్కటేశు మన్త్రము ॥ (2)
అన్ని మన్త్రములు నిన్దే ఆవహిఞ్చెను (1.5)

చరణం 2
రఙ్గగు వాసుదేవ మన్త్రము ధ్రువుణ్డు జపియిఞ్చె
నఙ్గ వింవె కృష్ణ మన్త్ర మర్జునుణ్డును । (2)
ముఙ్గిట విష్ణు మన్త్రము మొగి శుకుడు పఠిఞ్చె
విఙ్గడమై నాకు నబ్బె వేఙ్కటేశు మన్త్రము ॥ (2)
అన్ని మన్త్రములు నిన్దే ఆవహిఞ్చెను (1.5)

చరణం 3
ఇన్ని మన్త్రముల కెల్ల ఇన్దిరా నాధుణ్డె గురి
పన్నిన దిదియె పర బ్రహ్మ మన్త్రము । (2)
నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను
వెన్నెల వణ్టిది శ్రీ వేఙ్కటేశు మన్త్రము ॥ (2)
అన్ని మన్త్రములు నిన్దే ఆవహిఞ్చెను (2.5)




Browse Related Categories: