అన్నమయ్య కీర్తన మచ్చ కూర్మ వరాహ
మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ ॥ నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నిఞ్చు గోవిన్ద విష్ణు మధుసూదన । వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా సన్నుతిఞ్చే హృషికేశ సారకు పద్మనాభ ॥ కణ్టిమి దామోదర సఙ్కర్షణ వాసుదేవ అణ్టేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా । తొణ్టే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా జణ్టవాయుకు మచ్యుత జనార్దన ॥ మొక్కేము వుపేన్ద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ యెక్కితి శ్రీవేఙ్కట మిన్దిరానాథ । యిక్కువ నీ నామములు యివియే నా జపములు చక్కగా నీ దాసులము సర్వేశ అనన్త ॥
Browse Related Categories: