View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన ఏమని పొగడుదుమే


రాగం: సామన్త / ఆభేరి
ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స
తాళం: ఆదితాళం

పల్లవి
ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మఙ్గ ॥

చరణం 1
తెలికన్నుల నీ తేటలే కదవే ।
వెలయగ విభునికి వెన్నెలలు ।
పులకల మొలకల పొదులివి గదవే ।
పలుమరు పువ్వుల పానుపులు ॥

ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మఙ్గ ॥


చరణం 2
తియ్యపు నీమోవి తేనెలే కదవే ।
వియ్యపు రమణుని విన్దులివి ।
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె ।
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ॥

ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మఙ్గ ॥

చరణం 3
కైవసమగు నీ కౌగిలే కదవే ।
శ్రీ వేఙ్కటేశ్వరు సిరి నగరు ।
తావు కొన్న మీ తమకములే కదే ।
కావిఞ్చిన మీ కల్యాణములు ॥

ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మఙ్గ ॥




Browse Related Categories: