అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద
రాగం: సారన్గనాట ఆ: స రి1 మ1 ప ద1 స అవ: స ని3 స ద1 ప మ1 గ3 రి1 స తాళం: ఆది పల్లవి ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు । తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥ (2) చరణం 1 అన్త నిన్త గొల్లెతల అరచేతి మాణిక్యము । పన్త మాడే కంసుని పాలి వజ్రము । కాన్తుల మూడు లోకాల గరుడ పచ్చ బూస । చెన్తల మాలో నున్న చిన్ని కృష్ణుడు ॥ ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు..(ప..) చరణం 1 రతికేళి రుక్మిణికి రఙ్గు మోవి పగడము । మితి గోవర్ధనపు గోమేధికము । సతమై శఙ్ఖ చక్రాల సన్దుల వైడూర్యము । గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ॥ ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు..(ప..) చరణం 2 కాళిఙ్గుని తలలపై గప్పిన పుష్యరాగము । యేలేటి శ్రీ వేఙ్కటాద్రి యిన్ద్రనీలము । పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము । బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ॥ ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు..(ప..)
Browse Related Categories: