అన్నమయ్య కీర్తన కలిగెనిదె నాకు
కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది ॥ జయపురుషోత్తమ జయ పీతామ్బర జయజయ కరుణాజలనిధి । దయ యెఱఙ్గ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే ॥ శరణము గోవిన్ద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్ధన । పరమ మెఱఙ్గను భక్తి యెఱఙ్గను నిరతము నాగతి నీదాస్యమే ॥ నమో నారాయణా నమో లక్ష్మీపతి నమో పుణ్డరీకనయనా । అమిత శ్రీవేఙ్కటాధిప యిదె నా క్రమమెల్లను నీకయిఙ్కర్యమే ॥
Browse Related Categories: