View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన నారాయణాచ్యుత


రాగం: మాళవి
ఆ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 స
తాళం: ఆది

పల్లవి
నారాయణాచ్యుతానన్త గోవిన్ద హరి ।
సారముగ నీకు నే శరణణ్టిని ॥ (2)

చరణం 1
చలువయును వేడియును నటల సంసారమ్బు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ । (2)
ఫలములివె యీ రెణ్డు పాపములు పుణ్యములు
పులుపు దీపును గలపి భుజియిఞ్చినట్లు ॥ (2)
నారాయణాచ్యుతానన్త గోవిన్ద హరి..(ప..)

చరణం 2
పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు । (2)
నగియిఞ్చు నొకవేళ నలగిఞ్చు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బిఞ్చినట్లు ॥ (2)
నారాయణాచ్యుతానన్త గోవిన్ద హరి..(ప..)

చరణం 3
ఇహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరిఞ్చు భ్రాన్తియును విభ్రాన్తియును మతిని । (2)
సహజ శ్రీ వేఙ్కటేశ్వర నన్ను కరుణిమ్ప
బహువిధమ్బుల నన్ను పాలిఞ్చవే ॥ (2)
నారాయణాచ్యుతానన్త గోవిన్ద హరి
సారముగ నీకు నే శరణణ్టిని ॥ (2)




Browse Related Categories: