View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన ఎన్త మాత్రమున


ఎన్త మాత్రమున ఎవ్వరు తలచిన, అన్తమాత్రమే నీవు
అన్తరాన్తరములెఞ్చి చూడ, పిణ్డన్తే నిప్పటి అన్నట్లు ॥

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాన్తులు, పరబ్రహ్మమ్బనుచు ।
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు ।

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజిన్తురు ।
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పమ్బగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ॥

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు ।
శ్రీ వేఙ్కటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ॥




Browse Related Categories: