అన్నమయ్య కీర్తన చాలదా బ్రహ్మమిది
రాగం: సిన్ధుభైరవి ఆ: స రి2 గ2 మ1 గ2 ప ద1 ని2 స అవ: ని2 ద1 ప మ1 గ2 రి1 స ని2 స తాళం: ఖణ్డచాపు పల్లవి చాలదా బ్రహ్మమిది సఙ్కీర్తనం మీకు । జాలెల్ల నడగిఞ్చు సఙ్కీర్తనం ॥ (2) చరణం 1 సన్తోష కరమైన సఙ్కీర్తనం । సన్తాప మణగిఞ్చు సఙ్కీర్తనం । (2) జన్తువుల రక్షిఞ్చు సఙ్కీర్తనం । సన్తతము దలచుడీ సఙ్కీర్తనం ॥ చాలదా బ్రహ్మమిది సఙ్కీర్తనం మీకు..(ప..) చరణం 2 సామజము గాఞ్చినది సఙ్కీర్తనం । సామమున కెక్కుడీ సఙ్కీర్తనం । సామీప్య మిన్దరికి సఙ్కీర్తనం । సామాన్యమా విష్ణు సఙ్కీర్తనం ॥ చాలదా బ్రహ్మమిది సఙ్కీర్తనం మీకు..(ప..) చరణం 3 జముబారి విడిపిఞ్చు సఙ్కీర్తనం । సమ బుద్ధి వొడమిఞ్చు సఙ్కీర్తనం । జమళి సౌఖ్యములిచ్చు సఙ్కీర్తనం । శమదమాదుల జేయు సఙ్కీర్తనం ॥ చరణం 4 జలజాసనుని నోరి సఙ్కీర్తనం । చలిగొణ్డ సుతదలచు సఙ్కీర్తనం । చలువ గడు నాలుకకు సఙ్కీర్తనం । చలపట్టి తలచుడీ సఙ్కీర్తనం ॥ చరణం 5 సరవి సమ్పదలిచ్చు సఙ్కీర్తనం । సరిలేని దిదియపో సఙ్కీర్తనం । సరుస వేఙ్కట విభుని సఙ్కీర్తనం । సరుగనను దలచుడీ సఙ్కీర్తనం ॥ చాలదా బ్రహ్మమిది సఙ్కీర్తనం మీకు జాలెల్ల నడగిఞ్చు సఙ్కీర్తనం ॥ (2)
Browse Related Categories: