అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడు
రాగం: దేవగాన్ధారి /ఆనన్దభైరవి ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స తాళం: త్/ఏక పల్లవి ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిణ్డ బాలు వోయరే ॥ (2) చరణం 1 గామిడై పారితెఞ్చి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి । (2) చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ॥ (2) ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ఫా..) చరణం 2 ముచ్చువలె వచ్చి తన ముఙ్గ మురువుల చేయి తచ్చెడి పెరుగులోన దగబెట్టి । (2) నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి వాపోవువాని నూరడిఞ్చరే ॥ (2) ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ఫా..) చరణం 3 ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని వుఙ్గరాల చేయి పెట్టి । (2) అప్పడైన వేఙ్కటాద్రి అసవాలకుడు గాన తప్పకుణ్డ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ॥ (2) ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిణ్డ బాలు వోయరే ॥ (2) (ఫా..)
Browse Related Categories: