అన్నమయ్య కీర్తన హరి యవతార మితడు
హరి యవతార మీతడు అన్నమయ్య । అరయ మా గురుడీతడు అన్నమయ్య । వైకుణ్ఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య । ఆకసపు విష్ణు పాదమన్దు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ॥ ఈవల సంసార లీల ఇన్దిరేశుతో నున్న వాడు ఆవటిఞ్చి తాళ్ళపాక అన్నమయ్య । భావిమ్ప శ్రీ వేఙ్కటేశు పదములన్దే యున్నవాడు హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ॥ క్షీరాబ్ధిశాయి బట్టి సేవిమ్పుచు నున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య । ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ॥
Browse Related Categories: