రాగం: నాదనామక్రియా
ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3
అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3
తాళం: ఆది
పల్లవి
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే,
తన్దనాన అహి, తన్దనాన పురె
తన్దనాన భళా, తన్దనాన ॥ (2.5)`
చరణం 1
కన్దువగు హీనాధికము లిన్దు లేవు
అన్దరికి శ్రీహరే అన్తరాత్మ । (2)
ఇన్దులో జన్తుకుల మన్తా ఒకటే
అన్దరికీ శ్రీహరే అన్తరాత్మ ॥ (2)
తన్దనాన అహి, తన్దనాన పురె
తన్దనాన భళా, తన్దనాన ॥
చరణం 2
నిణ్డార రాజు నిద్రిఞ్చు నిద్రయునొకటే
అణ్డనే బణ్టు నిద్ర - అదియు నొకటే । (2)
మెణ్డైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చణ్డాలుడుణ్డేటి సరిభూమి యొకటే ॥ (2)
తన్దనాన అహి, తన్దనాన పురె
తన్దనాన భళా, తన్దనాన
చరణం 3
అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే ।
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటేరణమ్
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ॥
చరణం 4
కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే ।
పరగ దుర్గన్ధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ॥
చరణమ5
కడగి ఏనుగు మీద కాయు ఎణ్డొకటే
పుడమి శునకము మీద బొలయు నెణ్డొకటే । (2)
కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేఙ్కటేశ్వరు నామ మొకటే ॥ (2)
తన్దనాన అహి, తన్దనాన పురె
తన్దనాన భళా, తన్దనాన
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే,
తన్దనాన అహి, తన్దనాన పురె
తన్దనాన భళా, తన్దనాన