View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన కోడెకాడె వీడె


రాగం: సామన్త
ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
కోడెకాడె వీడె వీడె గోవిన్దుడు
కూడె ఇద్దరు సతుల గోవిన్దుడు ॥ (2.5)

చరణం 1
గొల్లెతల వలపిఞ్చె గోవిన్దుడు
కొల్లలాడె వెన్నలు గోవిన్దుడు । (2)
గుల్ల సఙ్కుఀజక్రముల గోవిన్దుడు
గొల్లవారిణ్ట పెరిగె గోవిన్దుడు ॥ (2)
కోడెకాడె వీడె వీడె గోవిన్దుడు.. (ప..)

చరణం 2
కోలచే పసులగాచె గోవిన్దుడు
కూలగుమ్మె కంసుని గోవిన్దుడు । (2)
గోలయై వేల కొణ్డెత్తె గోవిన్దుడు
గూళెపుసతుల~మ దెచ్చె గోవిన్దుడు ॥ (2)
కోడెకాడె వీడె వీడె గోవిన్దుడు.. (ప..)

చరణం 3
కున్దనపు చేలతోడి గోవిన్దుడు
గొన్దులు సన్దులు దూరె గోవిన్దుడు । (2)
కున్దని శ్రీవేఙ్కటాద్రి గోవిన్దుడు
గొన్ది~మ దోసె నసురల గోవిన్దుడు ॥ (2)
కోడెకాడె వీడె వీడె గోవిన్దుడు
కూడె ఇద్దరు సతుల గోవిన్దుడు ॥ (ప..) (2.5)




Browse Related Categories: