అన్నమయ్య కీర్తన వేడుకొన్దామా
వేడుకొన్దామా వేఙ్కటగిరి వేఙ్కటేశ్వరుని ॥ ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు । తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ॥ వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు । గొడ్డురాణ్డ్రకు బిడ్డలిచ్చే గోవిన్దుడే ॥ ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు । అలమేల్మఙ్గా శ్రీవేఙ్కటాద్రి నాథుడే ॥
Browse Related Categories: