View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన కొలిచిన వారల


రాగం: వరాళి
ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స
తాళం: ఊన్క్నొవ్న్

పల్లవి
కొలిచిన వారల కొఙ్గుపైడితడు ।
బలిమి తారక బ్రహ్మమీతడు ॥ (2.5)

చరణం 1
ఇనవంశామ్బుధి నెగసిన తేజము ।
ఘనయజ్ఞమ్బుల గల ఫలము । (2)
మనుజరూపమున మనియెడి బ్రహ్మము । (2)
నినువుల రఘుకుల నిధానమీతడు ॥
కొలిచిన వారల కొఙ్గుపైడితడు ..(ప..)

చరణం 2
పరమాన్నములోపలి సారపుజవి ।
పరగినదివిజుల భయహరము । (2)
మరిగినసీతా మఙ్గళసూత్రము । (2)
ధరలో రామావతారమ్బితడు ॥
కొలిచిన వారల కొఙ్గుపైడితడు ..(ప..)

చరణం 3
చకితదానవుల సంహారచక్రము ।
సకల వనచరుల జయకరము । (2)
వికసితమగు శ్రీవేఙ్కట నిలయము ।
ప్రకటిత దశరథ భాగ్యమ్బితడు ॥ (2)
కొలిచిన వారల కొఙ్గుపైడితడు ..(ప..)




Browse Related Categories: